బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి

బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి

05-05-2017

బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి

ఆసియాలోనే అత్యంత ఆధునికమైన క్యాన్సర్‌ ఆసుపత్రిగా పేరు పొందిన బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి, రీసెర్చ్‌ సెంటర్‌ ప్రారంభమైన నాటి నుంచి క్యాన్సర్‌ రోగులకు విరివిగా సేవలందిస్తోంది. క్యాన్సర్‌తో తన భార్య మరణించ డాన్ని చూసిన నాటి ముఖ్యమంత్రి ఎన్టీరామారావు ఈ ఆసుపత్రిని నిర్మించారు. క్యాన్సర్‌ వ్యాధి బారిన పడిన ప్రజలకు తగిన చికిత్సఅందించాలన్న ఉద్దేశ్యంతో రామారావు ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రి లాభార్జనే ధ్యేయంగా నడపకుండా పేదరోగులకు సైతం ఖరీదైనా క్యాన్సర్‌ ట్రీట్‌మెంట్‌ను అందించాలన్న తలంపుతో మొదటినుంచి పనిచేస్తోంది. ధనికుడైనా, పేదవాడైనా అందరికీ ఒకేరకమైన వైద్యం అందించడం ఈ క్యాన్సర్‌ ఆసుపత్రి లక్ష్యం.

క్యాన్సర్‌ రోగులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే మరోవైపు వారికి అందించాల్సిన వైద్యంపై చర్చిస్తూ ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారు. సర్జరీ, కెమోథెరపీ, రేడియోషన్‌ ద్వారా క్యాన్సర్‌ను నయం చేసేందుకు ఇక్కడి డాక్టర్లు ప్రయత్నిస్తుంటారు. ఆదిలోనే గుర్తించిన క్యాన్సర్‌ రోగులతోపాటు, ముదిరిపోయిన స్టేజిలో ఉన్న క్యాన్సర్‌ రోగులకు కూడా ఇక్కడ మంచి అందించేలా క్యాన్సర్‌ స్పెషలిస్టులు ఈ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. నర్సులు కూడా అంకితభావంతో సేవలందిస్తున్నారు. గ్రామాల్లోని పేదలకోసం ఈ ఆసుపత్రి అనేక వైద్యశిబిరాలను నిర్వహిస్తోంది. ఇతర అసోసి యేషన్లతో కలిసి, లేదా స్వంతంగా ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తూ క్యాన్సర్‌ సోకిల బాధితులను గుర్తించడంతోపాటు వారికి ట్రీట్‌మెంట్‌ను అందజేస్తోంది.

మొబైల్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ యూనిట్‌ ద్వారా ఇంటి వద్దకే వెళ్ళి క్యాన్సర్‌రోగులను గుర్తిస్తోంది. కొన్ని ప్రత్యేకమైన ప్యాకేజీల ద్వారా సరసమైన ధరలకే క్యాన్సర్‌ చికిత్సను అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఆసుపత్రిలో అనేక విభాగాలు ఉన్నాయి. సర్జికల్‌ అంకాలజీ, అనస్థీయాలజీ, మెడికల్‌ అంకాలజీ, రేడియేషన్‌ అంకాలజీ, దీంతోపాటు సపోర్టివ్‌ స్పెషాల్టి కింద జనరల్‌ మెడిసిన్‌, క్రిటికల్‌ కేర్‌, గైనకాలజీ, ఇఎన్‌టి, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, డయాగ్నస్టిక్‌ సర్వీస్‌ విభాగంలో రేడియాలజీ డిపార్ట్‌మెంట్‌, న్యూక్లియర్‌ మెడిసిన్‌ డిపార్టు మెంట్‌, లేబరేటరీ మెడిసిన్‌ డిపార్టుమెంట్‌ కింద పథాలజీ, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ ఉన్నాయి.

Head Office

Basavatarakam Indo American Cancer Hospital & Research Institute
Road No 14, Banjara Hills
Hyderabad 500034
Andhra Pradesh, India

Contact Details

Telephone: 91-40-23551235/23552131 23552766/23607944
VOIP No: +1 732 678 0116
Fax: 91-40-23542120
E-mail: info@induscancer.com