కోలాహలంగా గ్రేటర్ రిచ్మండ్ ఉగాది వేడుకలు

కోలాహలంగా గ్రేటర్ రిచ్మండ్ ఉగాది వేడుకలు

03-05-2017

కోలాహలంగా గ్రేటర్ రిచ్మండ్ ఉగాది వేడుకలు

గ్రేటర్‌ రిచ్‌మాండ్‌లో ఉగాది వేడుకలు కోలాహలంగా జరిగాయి. స్థానిక తెలుగు సంఘం గ్రేటర్‌ రిచ్మండ్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక హెర్మిటేజ్‌ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో దుర్ముఖి నామ ఉగాది వేడుకలను నిర్వహించారు. పంచాంగ శ్రవణంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అధ్యక్షుడు ముదిగొండ కృష్ణ ఆహుతులకు ఉగాది శుభాకాంక్షలు అందించారు. పంగులూరి కోటి, గడ్డం రాజగోపాల్‌ తదితరులు 2016-17 ఏడాదికి నూతన కార్యవర్గాన్ని సభకు పరిచయం చేశారు. నూతన అధ్యక్షుడిగా వాసిలి పద్మప్రవీణ్‌ ఎన్నికయ్యారు. సంస్థ నూతన వెబ్‌సైట్‌ను షషష.స్త్రత్‌ీaఙa.శీతీస్త్ర  రమేష్‌ రెడ్డి, గొర్రె రాజశేఖర్‌ తదితరులు ఆవిష్కరించారు.  ఉగాది వేడుకలను పురస్కరించుకుని తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు వేమన సతీష్‌ రిచ్‌ మాండ్‌ ప్రవాసులకు తన ఉగాది అభినందనలు తెలియజేశారు.