కనువిందు చేసిన “బాటా” ఉగాది

కనువిందు చేసిన “బాటా” ఉగాది

02-05-2017

కనువిందు చేసిన “బాటా” ఉగాది

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఉగాది వేడుకలను సన్నివేల్‌ హిందూ టెంపుల్‌లో ఘనంగా నిర్వహించారు. దాదాపు 2,000 మందికిపైగా తెలుగువారు ఈ వేడుకలకు తరలివచ్చారు. బే ఏరియా తెలుగు కమ్యూనిటీలో ఇది అతి పెద్ద ఈవెంట్‌గా నిలిచింది. ఉదయం 9 గంటలకు యూత్‌ టాలెంట్‌ షోతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు రామకృష్ణ వెనుజియా సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది. యు స్మైల్‌ డెంటల్‌, కేంబ్రిడ్జ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, కాల్‌ హోమ్స్‌ (రమణ రెడ్డి) 24 మంత్ర (ఆర్గానిక్‌ ఫుడ్స్‌) గ్రాండ్‌ స్పాన్సర్స్‌గా ఉన్నాయి. రవి ట్యాక్స్‌ సర్వీసెస్‌, లావణ్య దువ్వి (ఇంటెరో), స్వాగత్‌ రెస్టారెంట్స్‌, పీకాక్‌ కజిన్‌, స్కోపస్‌ కన్సల్టింగ్‌, నార్త్‌ వెస్టర్న్‌ పాలిటెక్నిక్‌ యూనివర్సిటీ (ఎన్‌పియు), పిఎన్‌జి  జ్యూవెల్లర్స్‌ సంస్థలు స్పాన్సర్లుగా వ్యవహరించాయి. మీడియా పార్ట్‌నర్స్‌గా దేశీ 1170 ఎఎం, విరిజల్లు, తెలుగు టైమ్స్‌, టీవీ9, ఎన్‌టివి, ఎబిఎన్‌, టీవీ5, హెచ్‌ఎంటీవీ, జెమిని టీవీలు ఉన్నాయి.

15వ యూత్‌ టాలెంట్‌ షోకు మంచి స్పందన వచ్చింది. దాదాపు 300కు పైగా చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. సుమంత్‌, అరుణ్‌ ఈ పోటీలను కో ఆర్డినేట్‌ చేయగా, రాజేష్‌, శ్రీలు ఎంసిలుగా, జయ శర్మ, సంగీత, అన అంజారియా, రవి, కృష్ణకాంత్‌, సాహితి, కీర్తి, మానస, శేస, శ్రీకృష్ణన్‌, మాధవి, విజేత జడ్జీలుగా వ్యవహరించారు. వ్యాసరచన పోటీలు, సైన్స్‌ ఫెయిర్‌, చెస్‌ పోటీలను యశ్వంత్‌ కో ఆర్డినేట్‌ చేయగా, శిరీష, పద్మ, సాయిలక్ష్మీ, హరి జడ్జీలుగా వ్యవహరించారు.

ఉగాది ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యాయి. బాటా సలహాదారు విజయ ఆసూరి అందరికీ స్వాగతం పలికారు. సన్నివేల్‌ టెంపుల్‌ పూజారి బాలకృష్ణ ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం చేశారు. మాధురి కిషోర్‌  'నర్తన రవళి', సన్నివేల్‌, ఫ్రీమాంట్‌, శాన్‌రామన్‌, శాన్‌హెసెలలోని చిన్నారులు చేసిన 'కేరింత' నృత్యాలు కనువిందు చేశాయి.  హిమబిందు చల్ల ఆధ్వర్యంలో నృత్య నంద స్కూల్‌, రంజని మంద ఆధ్వర్యంలోని విద్యార్థులు చేసిన నృత్యాలు, హంగామా పేరుతో  యూత్‌ చేసిన డ్యాన్స్‌ ఉర్రూతలూగించింది. నా సామిరంగా పేరుతో చేసిన హాస్యనాటిక అందరినీ నవ్వించింది. కళ్యాణ్‌ కట్టమూరి దీనికి దర్శకత్వం వహించారు. కామేష్‌, రవి, శ్రీనివాస్‌ తదితరులు దీనికి సహకరించారు. కరుణ్‌, హరినాథ్‌, శ్రీకర్‌, కళ్యాణ్‌ సహకారంతో శ్రీలు, శ్రీదేవి, దీప్తి, ఆదిత్య కోరియోగ్రఫీ చేసిన 'రుతురాగాలు' ఉగాది వేడుకల్లో హైలైట్‌గా నిలిచింది.

బాటా కమిటీ తరపున డా. రమేష్‌ అతిధులను వేదికపైకి ఆహ్వానించారు. సన్నివేల్‌ వైస్‌ మేయర్‌ గుస్తవ్‌, కుపర్టినో మేయర్‌ బారీ చాంగ్‌ ప్రత్యేక అతిధులుగా వచ్చారు. బాటా చేస్తున్న కార్యక్రమాలను వారు ప్రశంసించారు. ఈ వేడుకల్లోనే తెలుగు టైమ్స్‌, బాటా నిర్వహిస్తున్న 'పాఠశాల'లో పనిచేస్తున్న టీచర్లను, టీమ్‌ను పరిచయం చేశారు. బాటా మ్యాగజైన్‌ తెలుగు వెలుగును కూడా ఆవిష్కరించారు. ప్రసాద్‌ మ్యాగజైన్‌ ఎడిటర్‌గా పనిచేశారు. బాటా ప్రెసిడెంట్‌ కళ్యాణ్‌ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. బాటా టీమ్‌ను ఈ సందర్భంగా అందరికీ పరిచయం చేశారు.

శిరీష బత్తుల (వైస్‌ ప్రెసిడెంట్‌), యశ్వంత్‌ కుదరవల్లి (సెక్రటరీ), సుమంత్‌ పుసులూరి (ట్రెజరర్‌), హరినాథ్‌ చికోటి (జాయింట్‌ సెక్రటరీ), స్టీరింగ్‌ కమిటీ సభ్యులు రవి తిరువీధుల, కామేష్‌ మల్ల, కల్చరల్‌ డైరెక్టర్లు శ్రీదేవి పసుపులేటి, శ్రీలు వెలిగేటి, కిరణ్‌ విన్నకోట, తారకదీప్తి, లాజిస్టిక్స్‌ కమిటీ టీమ్‌ సభ్యులు శ్రీకర్‌ బొడ్డు, నరేష్‌ గాజుల, ప్రశాంత్‌, కొండల్‌ రావు, అరుణ్‌ రెడ్డి తదితరులను పరిచయం చేశారు. వేడుకను ఘనంగా నిర్వహించిన బాటా టీమ్‌ను బాటా అడ్వయిజరీ బోర్డ్‌ ప్రముఖులు జయరామ్‌ కోమటి, వీరు ఉప్పల, విజయ ఆసూరి, ప్రసాద్‌ మంగిన, కరుణ్‌ వెలిగేటి, రమేష్‌ కొండ  అభినందించారు. దాదాపు 2 నెలలుగా 100 మంది వలంటీర్లు ఈ వేడుక విజయవంతానికి కృషి చేశారు. రాజేష్‌, ప్రదీప్‌, పవిత్ర, నంద, వాణి, సమంత, ప్రసాద్‌, బాబి, ఫణి, ఆదిత్య, ధీరజ్‌, సందీప్‌, స్రవంతి, స్వాతి, అనంత, కృష్ణ ప్రియ, అపర్ణ, అనుష, దీప్తి, సురేష్‌, మాధురి, ప్రకాష్‌, సంతోష్‌, దీపిక, నిత్య, వల్లి, కీర్తి, మనస్వి, అవినాష్‌, సాయి తదితరులు ఈ వేడుక విజయవంతానికి సహకరించారు. 


Click here for Event Gallery