హారీస్ బర్గ్ లో తానా సంక్రాంతి పండుగ సంబరాలు

హారీస్ బర్గ్ లో తానా సంక్రాంతి పండుగ సంబరాలు

02-05-2017

హారీస్ బర్గ్ లో తానా సంక్రాంతి పండుగ సంబరాలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను ఇటీవల జరిపారు. ఫిలడెల్పియాలోని హారిస్‌బర్గ్‌ ఏరియాలోని గుడ్‌హోప్‌ మిడిల్‌ స్కూల్‌ ఆడిటోరియంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో దాదాపు 400 మందికి పైగా తెలుగువాళ్ళు పాల్గొన్నారు. సూపర్‌ సింగర్లు ఉష, హరిణి, వృథ్వీ తదితరులు తమ గానంతో వచ్చినవారిని పరవశింపజేశారు. తొలుత ఈ కార్యక్రమాలను ఎంసి శ్రీలక్ష్మీ కులకర్ణీ ప్రారంభించారు. పిల్లల ఫ్యాషన్‌  షో, టాలీవుడ్‌ సినిమా పాటలు, డ్యాన్స్‌లతో సంక్రాంతి వేడుక సంబరంగా సాగింది. ప్యాన్సీ  డ్రస్సులు, రంగవల్లుల పోటీలను నిర్వహించి విజేతలకు బహూమతులను అందజేశారు.

తానా పూర్వ అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేని, తానా జాయింట్‌ సెక్రటరీ రవి పొట్లూరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. మోహన్‌ నన్నపనేని మాట్లాడుతూ, తానా ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను, సేవలను నిర్వహిస్తున్నామని తెలిపారు. తానాలో సభ్యత్వం తీసుకోవాల్సిన అవశ్యకతను ఆయన తెలియజేసిన విధానం అందరికీ ఎంతో నచ్చింది. తానా వీడియో ప్రదర్శన, మోహన్‌ నన్నపనేని ప్రసంగంతో స్ఫూర్తి పొందిన ప్రముఖ ఎంట్రప్రెన్యూరర్‌ రఘు తడవర్తి ఈ వేడుకల్లో 15,000 డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. తానా ఫౌండేషన్‌ ద్వారా కాకినాడలో అనాథల కోసం ప్రత్యేకంగా ఓ బిల్డింగ్‌ కట్టేందుకు ఈ మొత్తాన్ని వినియోగించాలని ఆయన కోరారు. విరాళమిచ్చిన రఘును మోహన్‌, రవి పొట్లూరి ఘనంగా సన్మానించారు. తానా హారీస్‌బర్గ్‌ సిటీ కో ఆర్డినేటర్‌ సతీష్‌ చుండ్రు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు. తానా హారీస్‌బర్గ్‌ టీమ్‌ నరేంద్ర పాములపాటి, వెంకట్‌ సింగూ, కిశోర్‌ కొంక, శశీ జాస్తి, సందీప్‌ మాముమూరి, వెంకట్‌ చిమిలి, వెంకట్‌ నార్నె, శ్రీని కాకర్ల, శ్రీని కోట, సాంబ నిమ్మగడ్డ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బత్తినేని బ్రదర్స్‌కు చెందిన భెల్‌ ఇన్ఫో సొల్యూషన్స్‌ ఈ సంక్రాంతి కార్యక్రమానికి స్పాన్సర్‌గా వ్యవహరించింది.

Click here for Event Gallery