చికాగోలో "తెలుగు" సందడి

చికాగోలో "తెలుగు" సందడి

01-05-2017

చికాగోలో

(చికాగో నుంచి చెన్నూరి వెంకట సుబ్బారావు)

అమెరికాలోని చికాగో నగరం ఇప్పుడు తెలుగుమయమైంది. ఏర్‌పోర్ట్‌లోనూ, రోజ్‌మాంట్‌ కన్వెన్షన్‌ ప్రాంతంలోనూ తెలుగువాళ్ళ సందడి కనిపిస్తోంది. అమెరికా తెలుగు సంఘం (ఆటా) సిల్వర్‌ జూబ్లి వేడుకల్లో పాల్గొనేందుకు ఎంతోమంది తెలుగువాళ్ళు ఇండియా నుంచి ఇతర నగరాల నుంచి చికాగో విమానాశ్రయానికి తరలి వచ్చారు. వచ్చినవారిని రిసీవ్‌  చేసుకునేందుకు ఆటా నాయకులు అక్కడ వేచి ఉండటంతో విమానాశ్రయం తెలుగువాళ్ళతో క్రిక్కిరిసి కనిపిస్తోంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు టాలీవుడ్‌ నుంచి కళాకారులు ఎంతోమంది తరలి వచ్చారు. రాశీఖన్నా వచ్చినప్పుడు ఆటా నాయకులు స్వాగతం పలికారు. కేంద్రమంత్రి ఎం. వెంకయ్య నాయుడు విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. జిఎంఆర్‌ అధినేత గ్రంథి మల్లిఖార్జునరావును కూడా ఆటా నాయకులు ఘనంగా రిసీవ్‌ చేసుకున్నారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపి జగదీశ్వర్‌ రెడ్డి తదితరులు కూడా ఆటా మహాసభలకు తరలి వచ్చారు. సంగీత దర్శకుడు మణిశర్మ కూడా ఆటా మహాసభలకోసం చికాగోకు చేరుకున్నారు. 


Click here for Event Gallery