ఇండియానాపొలిస్ లో "ఆటా" మీట్ అండ్ గ్రీట్

ఇండియానాపొలిస్ లో "ఆటా" మీట్ అండ్ గ్రీట్

01-05-2017

ఇండియానాపొలిస్ లో

అమెరికా తెలుగు సంఘం మహాసభలను పురస్కరించుకుని ఇండియానాపొలిస్‌లో ఆటా మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమం జరిగింది. ఇండియానాపొలిస్‌లోని అంబర్‌ ఇండియా రెస్టారెంట్‌లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా ఆటా వ్యవస్థాపకుడు హనుమంతరెడ్డి హాజరయ్యారు. కిషన్‌ పుల్లూరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హనుమంత రెడ్డి మాట్లాడుతూ, అమెరికా తెలుగు సంఘం మహాసభలు జూలై 1 నుంచి 3వ తేదీ వరకు చికాగోలోని స్టీపెన్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతోందని. ఈ మహాసభలకు తెలుగు వాళ్ళంతా కుటుంబంతో సహా హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇండియానాపొలిస్‌ తెలుగు ప్రముఖుడు రాజు చింతలతోపాటు భరత్‌ గాలి, వసంత్‌ మొగలి, నవీన్‌ రెడ్డి, లవకర్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ కృష్ణమనేని, రాము చింతల, అజయ్‌ పొనుగోటి తదితరులు హాజరయ్యారు.

Click here for Photogallery