లోకేష్ కు ఘనస్వాగతం పలికిన ఎన్నారై అభిమానులు

లోకేష్ కు ఘనస్వాగతం పలికిన ఎన్నారై అభిమానులు

01-05-2017

లోకేష్ కు ఘనస్వాగతం పలికిన ఎన్నారై అభిమానులు

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేష్‌కు అమెరికాలో ఘన స్వాగతం లభించింది. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల 30 నిముషాలకు ఆయన దిగిన వెంటనే ఎన్నారై తెలుగుదేశం పార్టీ నాయకుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో ఎన్నారై టిడిపి అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వందలాదిమంది కార్యకర్తలు లోకేష్‌కు భారీగా స్వాగతం పలికారు. పూలమాలలతో పుష్పగుచ్చాలతో ఆయనకు అందించారు. కార్యకర్తల జై తెలుగుదేశం నినాదాలతో విమానాశ్రయం సందడిగా మారింది. లోకేష్‌ కూడా అభిమానులతో కలిసిపోయి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. తరువాత అభిమానులతో లోకేష్‌ ఫోటోలు దిగారు.

ఈ సందర్భంగా అభిమానులు లోకేష్‌ మంచి నాయకుడు కాగలదన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. జయరాం కోమటితోపాటు వెంకట్‌ కోగంటి, యశ్వంత్‌ కుదరవల్లి, సుమంత్‌ పుసులూరి, సతీష్‌ వేమూరి, ప్రసాద్‌ వాసిరెడ్డి, దిలీప్‌కుమార్‌ చంద్ర, వీరు ఉప్పల, జెపి వేజెండ్ల, సుబ్బు నిమ్మగడ్డ, హేమారావు నందిపాటి, క్రిస్‌ యలవర్తి, బాబు ప్రత్తిపాటి, కళ్యాణ్‌ కట్టమూరి, రమేష్‌ కొండ, రజనీకాంత్‌ కాకర్ల, రామ్‌ తోట, శ్రీకాంత్‌ కోనేరు, రమేష్‌ పాలేరు, మధు రావెళ్ళ ఫణి ఉప్పల, మల్లిక్‌ మామిడిపాక, సతీష్‌ అంబటి, యుగంధర్‌, సుమంత్‌ పి, భాస్కర్‌ వల్లభనేని, కంచెర్ల రమేష్‌, శ్రీని వల్లూరిపల్లి, బిఎస్‌.రావు తదితరులు లోకేష్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. 

 

Click here for Photogallery