మహాయాగానికి అతిరథ మహారథులు

మహాయాగానికి అతిరథ మహారథులు

28-04-2017

మహాయాగానికి అతిరథ మహారథులు

మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అయుత చండీయాగం నిర్వహిస్తున్నారు. అయితే ఈ అయుత చండీ యాగానికి  దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన పదవులు నిర్వహించే అతిరథ మహారథులు హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న పండితులు, పీఠాధిపతులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు చండీయాగంలో పాల్గొంటున్నారు. నాలుగో  రోజున  తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు ఉదయమే వచ్చి పూజలో పాల్గొన్నారు. మధ్యాహ్నం తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ఎన్సీపీ నేత శరద్‌పవార్‌, కాంగ్రెస్‌ నేతలు సుబ్బిరామిరెడ్డి, గీతారెడ్డి హాజరయ్యారు. అతిథులకు వేదపండితులు పూర్ణకుంభం, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు.

Click here for Photogallery