చండీయాగానికి హాజరైన ఎన్సీపీ నేత శరద్ పవార్

చండీయాగానికి హాజరైన ఎన్సీపీ నేత శరద్ పవార్

28-04-2017

చండీయాగానికి హాజరైన ఎన్సీపీ నేత శరద్ పవార్

మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలో జరుగుతోన్న అయుత చండీయాగానికి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ హాజరయ్యారు. శరద్‌ పవార్‌కు పండితులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.  ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ శరద్‌ పవార్‌కు శాలువా కప్పి సన్మానించారు. అమ్మవారి వద్ద నుంచి తెచ్చిన పూలమాల వేశారు. అమ్మవారి వెండి ప్రతిమను బహుకరించారు.  శరద్‌ పవార్‌ వెంట కాంగ్రెస్‌ నేతలు టి. సుబ్బిరామిరెడ్డి, గీతారెడ్డి తదితరులు హాజరయ్యారు. 

ప్రముఖులకు చండీమాత ప్రతిమలు

అయుత చండీయాగానికి 4వ రోజు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు యాగానికి హాజరైన తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, టి.సుబ్బరామిరెడ్డి, ఇతర ప్రముఖులకు అరుణ శాలువాలు, చండీమాత ప్రతిమలు, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు.