ఎర్రవెల్లికి పోటెత్తిన భక్తజనం

ఎర్రవెల్లికి పోటెత్తిన భక్తజనం

28-04-2017

ఎర్రవెల్లికి పోటెత్తిన భక్తజనం

మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహిస్తున్న అయుత చండీయాగం జరుగుతున్న యాగస్థలం భక్త జనసంద్రంగా మారిపోయింది. జిల్లా నుంచే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని వివిద ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు చండీయాగం చూస్తేందుకు వస్తుండటంతో అక్కడ ఏర్పాటు చేసిన క్యూలైన్లన్నీ కిక్కిరిసి పోయాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్‌ సర్వీసులు ఏర్పాటు చేశారు. దాదాపు 3వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సందర్శకులకు నిర్వాహకులు భోజన సదుపాయం కల్పించారు.