దేశ చరిత్రలో తొలిసారి

దేశ చరిత్రలో తొలిసారి

28-04-2017

దేశ చరిత్రలో తొలిసారి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పారు. రాజు స్థానంలో ఉన్న వ్యక్తి మహాయాగం చేయడం అరుదు కాగా, తెలంగాణ రాష్ట్రానికి అధిపతిగా ఉన్న కేసీఆర్‌ జాతీయ రికార్డు సొంతం చేసుకున్నారు. లోక కల్యాణార్థం రాష్ట్ర ప్రజల క్షేమం, రాష్ట్ర ప్రగతిని కాంక్షిస్తూ ఒక ముఖ్యమంత్రి ఆయుత చండీయాగం నిర్వహించిన సందర్భంలో దేశంలో లేకపోగా ఈ ఘనత సాధించిన ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ నిలిచారు. ఏ జగదుర్గు పీఠాధీశ్వరులో, సంపూర్ణ దీక్షాపరులో మహాయజాన్ని చేయడం వినగా, ముఖ్యమంత్రే యజ దీక్ష చేపట్టడం ఆస్తికులను ఆనందానికి గురిచేస్తోంది. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ హాజరవుతుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యాగం గురించి ఆరాతీశారు. విజయవాడ వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును యాగానికి ఆహ్వానించగా, దక్షిణాధి రాష్ట్రాలలో పాటు ఉత్తరాది రాష్ట్రాల ప్రముఖులు కూడా యాగానికి వచ్చేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు.

 

Click here for Photogallery