ఎర్రవల్లిలో ఆధాత్మిక శోభ

ఎర్రవల్లిలో ఆధాత్మిక శోభ

28-04-2017

ఎర్రవల్లిలో ఆధాత్మిక శోభ

మెదక్‌ జిల్లా ఎర్రవల్లిలో ఆధ్యాత్యిక సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు  భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్‌ సర్వీసలు ఏర్పాటు చేశారు. ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తలు, సందర్శకుల రాకతో ఎరవ్రల్లి చేరుకునే దారులన్నీ కిటకిటలాడుతున్నాయి. ప్రతి రోజు 50 వేల మంది సందర్శకులకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఒకేసారి దాదాపు 5వేల మంది భోజనం చేసేందుకు వీలుగా భోజన శాలలు ఏర్పాటు చేశారు.