రుత్విగ్వరణం నిర్వహించిన కేసీఆర్ దంపతులు

రుత్విగ్వరణం నిర్వహించిన కేసీఆర్ దంపతులు

28-04-2017

రుత్విగ్వరణం నిర్వహించిన కేసీఆర్ దంపతులు

అయుత చండీ మహాయాగం పూర్వరంగంలో మరో ముఖ్యమైన ఘట్టం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు రుత్విగ్వరణం నిర్వహించారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి దాదాపు రెండు వేల మంది రుత్విజులు యాగాశాలకు చేరుకున్నారు. వారందరికీ ముఖ్యమంత్రి దంపతులు దీక్షా వస్త్రాలు, సామాగ్రి అందచేశారు. 12 మంది రుత్విజులకు స్వయంగా ముఖ్యమంత్రి దంపతులు పాదాభివందనం చేసి వస్త్రా ప్రదానం చేశారు. మిగతా వారికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత రెడ్డి, మర్రి జనార్థన్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్‌, పూల రవిందర్‌, పురాణం సతీస్‌ తదితరులు వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యాగాశాల చుట్టూ తిరిగి రుత్వికుల తలపై పూలు, అక్షింతలు చల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. రుత్విజులకు బాధ్యతలు, విధులు అప్పగించారు. రుత్విగ్వరణం సందర్భంగా దుర్గాదీప నమస్కార పూజ, రక్షా సుదర్శన హోమం నిర్వహించారు. కేసీఆర్‌ తన అక్కా చెల్లెలకు కూడా పాదాభివందనం చేసి అశీర్వాదం తీసుకున్నారు.