గౌరీ హోమంలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు

గౌరీ హోమంలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు

28-04-2017

గౌరీ హోమంలో పాల్గొన్న కేసీఆర్ దంపతులు

మెదక్‌ జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో ఆయుత మహా చండీయాగానికి  నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు ఆరంభపూజ నిర్వహించారు. నేడు ఉదయం నిర్వహించిన త్రైలోక్య మోహన గౌరీ హోమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు. ఉదయం గౌరీహోమంతో పాటు గరు ప్రార్థన, గణపతిపూజ, గోపూజ, ఉదక శాంతి, ఆచార్యాది రుత్విగ్వరణం, మహా మంగళహారతి, మంత్ర పుష్పం, సాయంత్రం, రుత్విగ్వరణం, దుర్గా దీప నమస్కార పూజ, రక్షా సుదర్శన హోమం ఉంటాయని నిర్వహణ ఆచార్యులు బృందం తెలిపింది. ఈ నెల 23 నుంచి 27 వరకు నిర్వహించనున్న ఆయుత మహా చండీయాగానికి పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాగశాల వద్ద ఏర్పాట్లను జిల్లా ఎస్పీ సుమతి పరిశీలించారు.