అయుత చండీయాగానికి అంకురార్పణ

అయుత చండీయాగానికి అంకురార్పణ

28-04-2017

అయుత చండీయాగానికి అంకురార్పణ

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్‌ జిల్లా ఎరవ్రల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించతలపెట్టిన ఆయుత మహా చండీయాగం కార్యక్రమాలకు అంకురార్పణ జరిగింది. అయుత మహా చండీయాగ పూర్వరంగంలో భాగంగా ముక్కోటి ఏకాదశి పర్వదినాన కేసీఆర్‌ దంపతులు ఆరంభ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 10:55 గంటలకు నిర్ణయించిన ముహూర్తంలో గురు ప్రార్ధనతో కార్యక్రమం ప్రారంభమైంది. శృంగేరి పీఠం నుంచి వచ్చిన రుత్విజులు వి.ఫణిశశాంక శర్మ, గోపికృష్ణ శర్మ, సిహెచ్‌. హరినాథశర్మ ఆధ్వర్యంలో బ్రాహ్మణులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సహస్ర మోదకాలతో గణపతి పూజ నిర్వహించారు. తదేవ చంద్రబలం, తదేవ తారా బలం... శుక్లాంభరధరం, విష్ణు.. సర్వేభ్యో, బ్రాహ్మణేభ్యో... సుముహూర్తస్తు అంటూ సహస్ర నామ పఠనం జరిగింది. రుత్విజులు మహా సంకల్పం కూడా చెప్పారు.  కార్యక్రమంలో భాగంగా గురు ప్రార్థన, పుణ్యాహవాచనము, దేవనాంది, అంకురార్పణం, పంచగవ్వమేళనం, ప్రాశనము, గోపూజ, యాగశాల, ప్రవేశం, యాగశాల సంస్కారం, అఖండ దీపారధన, మహా మంగళ హారతి, ప్రార్థన తదితర కార్యక్రమాలు జరిగాయి.