డిట్రాయిట్ లో బతుకమ్మ వేడుకలు

డిట్రాయిట్ లో బతుకమ్మ వేడుకలు

27-04-2017

డిట్రాయిట్ లో బతుకమ్మ వేడుకలు

అమెరికాలోని డెట్రాయిట్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తెలుగు అసోసియేషన్‌ (టాటా) వీటా, టీటీఏ, ఇతర మెట్రో డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 1200 మంది పాల్గొన్నారు. సంబురాల్లో భాగంగా తొలుత గణపతి పూజ, గౌరీ పూజ, జమ్మి పూజలు నిర్వహించారు.  అనంతరం మహిళలు రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు.

తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను తలపించేలా గాయని స్వర్ణక్క, గాయకుడు కృష్ణప్రసాద్‌లు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి విచ్చేసిన ప్రతినిధులు బతుకమ్మ విశిష్టతను వివరించారు. కాశి  కొత్త, సునిల్‌ మర్రి, శ్రీచరణ్‌, డా.హరినాథ్‌ పులిచెర్ల, సన్నిరెడ్డి, కృష్ణప్రసాద్‌, విజయ్‌ సేరీ, అశోక్‌, రాజు, వెంకట్‌, శ్రీధర్‌, మధు తదితరులు పాల్గొన్నారు.