మిల్ పిటాస్ లో ముగిసిన కనకదుర్గ పూజలు

మిల్ పిటాస్ లో ముగిసిన కనకదుర్గ పూజలు

26-04-2017

మిల్ పిటాస్ లో ముగిసిన కనకదుర్గ పూజలు

మిల్‌పిటాస్‌లోని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఏప్రిల్‌ 22 నుంచి 24వ తేదీ వరకు జరిగిన విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారి కుంకుమ పూజులు ఘనంగా ముగిశాయి. మూడురోజులపాటు జరిగిన ఈ పూజల్లో ఎక్కువమంది మహిళలు పాల్గొన్నారు. బ్యాచ్‌లుగా జరిగిన పూజల్లో పాల్గొన్న భక్తుల చేత  విజయవాడ నుంచి వచ్చిన శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం పూజారులు అమ్మవారి పూజలను నిర్వహింపజేశారు. కుంకుమార్చనతోపాటు త్రిశతి, ఖడ్గమాల, శ్రీ లలితాసహస్రనామ పూజలను కూడా చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి ప్రసాదంతోపాటు డాలర్‌ను, శ్రీచక్రంతో కూడిన రాగిరేకును బహూకరించారు. ఆలయ ప్రెసిడెంట్‌ వెంకట్‌ రెడ్డి ఈ పూజలను ఘనంగా నిర్వహింపజేయడంతోపాటు భక్తులకు ఎలాంటి లోటు రానీకుండా చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పూజారులు లింగంభొట్ల దుర్గాప్రసాద్‌, శంకర శాండిల్య, కోట ప్రసాద్‌, శంకరమంచి ప్రసాద్‌, గోపాలకృష్ణలతోపాటు పిఆర్‌ఓ, ఆలయ అధికారి అచ్చుతరామయ్య, రాష్ట్ర దేవాదాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సాయికుమార్‌తోపాటు, శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ పూజారులు ఇతరులు పాల్గొన్నారు.