తొలి భారతీయ అమెరికన్ సెనెటర్గా కమలా హారిస్ రికార్డు

తొలి భారతీయ అమెరికన్ సెనెటర్గా కమలా హారిస్ రికార్డు

24-04-2017

తొలి భారతీయ అమెరికన్ సెనెటర్గా కమలా హారిస్ రికార్డు

డెమోక్రటిక్‌ పార్టీ తరపున కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి గెలుపొందిన  తొలి భారతీయ అమెరికన్‌ మహిళగా కమలా  హారిస్‌ చరిత్ర సృష్టించారు.2004లో పదవీ విరమ ణ పొందిన బార్బర బాక్సర్‌ స్థానంలో ఆమె సెనెటర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. హారిస్‌ కాలిఫోర్నియాలోని ఓక్లాండ్‌లో హారిస్‌ జన్మించారు. చెన్నైకు చెందిన హారిస్‌ తల్లిదండ్రులు 1960లో అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. హారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ క్యాన్సర్‌ స్పెషలిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం హారిస్‌ న్యాయవృత్తిలో ఉండటంతో పాటు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.