విజయవాడలో 'తానా' క్యాన్సర్ నిర్ధారణ శిబిరం

విజయవాడలో 'తానా' క్యాన్సర్ నిర్ధారణ శిబిరం

23-04-2017

విజయవాడలో 'తానా' క్యాన్సర్ నిర్ధారణ శిబిరం

తానా చైతన్య స్రవంతి, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పెన్షనర్ల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్‌ 18న  రెండు రోజుల ఉచిత క్యాన్సర్‌ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని విజయవాడలోని స్థానిక సిద్ధార్థ ఫార్మసీ కళాశాలలో ఏర్పాటు చేశారు. బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ రీసెర్చ్‌ వైద్యులు, సిబ్బంది విచ్చేసి ప్రాథమిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. రక్త పోటు, ఈసీజీ మమ్మోగ్రఫీ, పాప్‌ స్మియర్‌,  అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు అందించారు. తానా చైతన్య స్రవంతి చైర్మన్‌ శ్రీనివాస్‌ గోగినేని, ఎస్‌బీఐ పింఛనర్ల సంఘం ఉపాధ్యక్షుడు కె.ఎస్‌.రామచంద్రరావు, ఐ.రామకృష్ణారావు, జి.కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ శిబిరం నేడు కూడా ఉంటుందని, సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.