డిసెంబర్‌ 9 నుంచి 23 వరకు నాటా సేవాదినోత్సవాలు

డిసెంబర్‌ 9 నుంచి 23 వరకు నాటా సేవాదినోత్సవాలు

17-08-2017

డిసెంబర్‌ 9 నుంచి 23 వరకు నాటా సేవాదినోత్సవాలు

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో మాతృరాష్ట్రాల్లో డిసెంబర్‌ 9 నుంచి 23 వరకు నాటా సేవాదినోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంచినీటి వసతి సౌకర్యం, సోలార్‌ స్ట్రీట్‌ లైట్స్‌ ఏర్పాటు, స్కూళ్ళలో మరుగుదొడ్ల ఏర్పాటు, స్కూళ్ళకు కంప్యూటర్‌ల బహూకరణ, ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల పంపిణీ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నాటా ఓ ప్రకటనలో తెలిపింది.