రివ్యూ : బోయపాటి మాస్ మసాలా మార్క్ 'జయ జానకి నాయక'

రివ్యూ : బోయపాటి మాస్ మసాలా మార్క్ 'జయ జానకి నాయక'

11-08-2017

రివ్యూ : బోయపాటి మాస్ మసాలా మార్క్ 'జయ జానకి నాయక'

తెలుగుటైమ్స్ .నెట్ రేటింగ్ 3/5

బ్యానర్ : ద్వారకా క్రియేషన్స్
నటీనటులు :బెల్లంకొండ సాయి శ్రీనివాస్,జగపతి బాబు, శరత్ కుమార్, రకుల్ ప్రీత్ సింగ్,
ప్రగ్యా జైస్వాల్ , క్యాథెరిన్ ట్రెసా, సితార, వాణి విశ్వనాధ్, చలపతి రావు,  నందు, తది తరులు....

సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర్రావు
సంగీతం : దేవిశ్రీప్రసాద్, పాటలు : రామ జోగయ్య శాస్ట్రీ, చంద్ర బోస్, శ్రీ మణి
పోరాటాలు: రామ్ లక్ష్మణ్, మాటలు: ఎం.రత్నం
నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: బోయపాటి శ్రీను

విడుదల తేదీ:11.08.2017

 

స్టార్ హీరో లతో సూపర్ హిట్ చిత్రాలను అందించిన  టాప్ డైరెక్టర్  బోయపాటి శ్రీను అంటే మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్  వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ దర్శకుడు నుంచి సినిమా వస్తుందంటే ఖచ్చితంగా అందులో మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయని ఆడియన్స్ ఫీలవుతారు.`జ‌య జాన‌కి నాయ‌క‌`. టైటిల్ పరంగా ఇది సాఫ్ట్ గా వున్నా  ‘ఇది ల‌వ్‌స్టోరీ..’ అంటూ  టైటిల్ లో ఒక ప్రేమికుడి  విజయం వుంది అంటూ  మరో  ప‌క్కా మాస్‌ చిత్రంగా రూపొందించాడు. అల్లు అర్జున్   'సరైనోడు'  తర్వాత  బోయపాటి శ్రీను నుంచి వచ్చిన  మాస్ ఎంటర్టైనర్ ‘జయ జానకి నాయక’. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

కథ :

చక్రవర్తి గ్రూప్ అఫ్ కంపెనీస్ ఎండీ చక్రవర్తి (శరత్ కుమార్) అతనికి ఇద్దరు కొడుకులు గగన్(బెల్లంకొండ శ్రీనివాస్), అన్న(నందు). కొడుకులకి చక్రవర్తి ఒక స్నేహితుడుగా ఉంటాడు. వాళ్ళు చేసే అన్ని పనులకి సపోర్ట్ గా ఉంటాడు. అలాగే కొడుకులకి కూడా తండ్రి అంటే ప్రాణం.  స్వీటీ (ర‌కుల్ ప్రీత్‌సింగ్‌) మంచి అమ్మాయి. అందంగా ఉంటుంది. వాళ్ళ లైఫ్ హ్యాపీ గా సాగిపోతున్న టైం లో గగన్ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది. . మ‌న‌సూ గొప్ప‌ది. త‌న‌ని ఓ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేసిన గ‌గ‌న్ ని ఇష్ట‌ప‌డుతుంది. గ‌గ‌న్‌కి నాన్న  అన్న అంటే ప్రాణం. అయితే ఆ ఇంటికి ఆడ‌దిక్కులేదు. అందుకే ఆ బాధ్య‌త త‌నే తీసుకొని – ఇంటినీ, ఆ ఇంట్లో మ‌నిషుల్ని గాడిలో పెడుతుంది. గ‌గ‌న్ అన్న‌య్య ప్రేమించిన అమ్మాయిని ఆ ఇంటి కోడ‌లుగా తీసుకొస్తుంది. దాంతో… ఆ ఇంట్లోవాళ్లంతా స్వీటీకి అభిమానులుగా మారిపోతారు. గ‌గ‌న్ కూడా స్వీటీపై ఇష్టం పెంచుకొంటాడు. అది ప్రేమ‌గా మారుతుంది. స్వీటీ కూడా ప్రేమిస్తుంది. అయితే.. ఈ ద‌శ‌లో స్వీటీ జీవితంలో అనుకోని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. రెండు ముఠాల నుంచి ప్ర‌మాదం ముంచుకొస్తుంది. అందులో అశ్వింత్ నారాయ‌ణ్ (జ‌గ‌ప‌తిబాబు) ప‌రువు కోసం ప్రాణాలు ఇచ్చే, తీసేంత మ‌నిషి. అశ్విన్ ప‌రువుకీ, స్వీటీకీ సంబంధం ఏమిటి? స్వీటీ అశ్వింత్ నారాయ‌ణ్‌కి ఏమ‌వుతుంది..? అస‌లు స్వీటీకి వ‌చ్చిన స‌మ‌స్యేంటి? అందులోంచి గ‌గ‌న్‌ ఎలా కాపాడాడు? అనేదే మిగిలిన క‌థ‌.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

హీరోగా బెల్లంకొండ పెర్ఫార్మెన్స్ వరకు గత సినిమాలతో పోల్చుకుంటే చాలా మెరుగు పడ్డాడని అనిపిస్తుంది. డైలాగ్, బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. ఈ సినిమాలో గగన్ పాత్ర అతనికి భాగా షూట్ అయ్యింది. శ్రీ‌నివాస్ హుషారు డాన్సుల‌కు, ఫైటింగుల‌కే ప‌రిమిత‌మైంది. డైలాగులు త‌క్కువ‌. ఉతుకుడు ఎక్కువ‌. దాదాపుగా ఓకే ర‌క‌మైన ఎక్స్ ప్రెష‌న్ ఇచ్చాడు. ‘ఇది త‌ప్ప ఏదీ రాదా ‘అంటూ ర‌కుల్ చేత ఓ డైలాగ్ చెప్పించాడు బోయ‌పాటి. సేఫ్ సైడ్‌గా. అయితే యాక్ష‌న్ ఎపిసోడ్స్‌లో ఇర‌గ‌దీశాడు. క్లైమాక్స్‌లో డైలాగులు కూడా బాగానే ప‌లికాడు. సినిమాలో అందరికంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ మాత్రం రకుల్ ప్రీత్ సింగ్. ఆమె పాత్రలో రెండు రకాల వేరియేషన్స్ ని ఆమె భాగా ప్రెజెంట్ చేయగలిగింది.జ‌గ‌ప‌తిబాబు క‌నిపించిన ప్రారంభ స‌న్నివేశాలు చూస్తే.. ఇది మ‌రో లెజెండ్ అనిపిస్తుంది. ఎందుకనో ఆ పాత్ర ప్ర‌భావం క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తుంది.  ఇది వరకు సినిమాలతో పోల్చుకుంటే ఇందులో జగపతి బాబు పాత్రలో ఎమోషనల్ విలనిజం కనిపిస్తుంది. శ‌ర‌త్ కుమార్ డీసెంట్‌గా న‌టించాడు చాలా కీలకమైన పాత్ర చేసి మెప్పించాడు. కొడుకులని ప్రేమించే తండ్రిగా, ప్రేమని గౌరవించే తండ్రిగా అతని పాత్ర చాలా నేచురల్ గా ఉంటుంది. ఇక మెయిన్ విలన్ గా చేసిన తరుణ్ అరోరా, హీరో అన్నగా చేసిన నందు వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక సెకండ్ హీరోయిన్ గా చేసిన ప్రగ్యా, మినిస్టర్ గా చేసిన సుమన్ వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు. వాణీ విశ్వ‌నాథ్‌ సినిమాకి అంతగా ఉపయోగపడలేదు. 

సాంకేతిక వర్గం :

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే అది ఖచ్చితంగా బోయపాటి మార్క్ మాసిజం. అతని నుంచి ఆడియన్స్ ఏవైతే ఆశించి సినిమాకి వెళ్తారో అలాంటి సన్నివేశాలు సినిమాలో  పుష్కలంగా వున్నాయి. సినిమా టైటిల్‌, కొన్ని ప్ర‌చార చిత్రాలు చూస్తే.. బోయ‌పాటి మారాడేమో, కొత్తగా ఏమైనా ఆలోచిస్తున్నాడేమో, కొత్త క‌థ ఏమైనా చెబుతున్నాడేమో అనిపిస్తుంది. అయితే అక్క‌డ‌క్క‌డ కాస్త అలాంటి ప్ర‌య‌త్నం చేసినా.. వ‌ర్జిన‌ల్ బోయ‌పాటి మాత్రం అలానే ఉన్నాడు ఏమాత్రం మార‌లేదు. దేవిశ్రీ ప్ర‌సాద్ ఆర్‌.ఆర్ అదిరిపోయింది. పాట‌లు బాగున్నాయి. వాటిని పిక్చ‌రైజ్ చేసిన ప‌ద్ధ‌తీ బాగుంది. రిషి పంజాబీ కెమెరా ప‌నిత‌నం వ‌ల్ల‌ నిర్మాత పెట్టిన ఖ‌ర్చు  తెర‌పై కంటికింపుగా  క‌నిపిస్తాయి. ఎం.రత్నం రాసిన ఆడ‌వాళ్ల గురించి చెప్పిన డైలాగులు బాగా పేలాయి.

విశ్లేషణ :

ఏది ఏమైనా ఈ  సినిమా బోయపాటి మార్క్ లోనే వుంది. ఇందులో బోయపాటి హీరో, విలన్ మాసిజానికి, రకుల్  బెల్లంకొండ కొండ శ్రీనివాస్ లవ్ స్టొరీ కాస్తా ఎమోషనల్ టచ్ ఇవ్వడం జరిగింది. ఇక జగపతి బాబు తరుణ్ అరోరా విలనిజంతో మాస్ ఆడియన్స్ ని భాగా టార్గెట్ చేశారు.విశ్రాంతి ముందొచ్చే యాక్ష‌న్ ఘ‌ట్టం బాగుంది. ఆ ట్విస్టు కూడా.. షాకింగ్‌గానే ఉంటుంది. ద్వితీయార్థంలో కేవ‌లం క‌థ‌పైనే ఫోక‌స్ పెట్టాడు ద‌ర్శ‌కుడు. పెద్దగా కొత్తదనం లేకపోవడం, కొన్ని సీన్ లలో  లాజిక్స్ మిస్సవదేవం మినహా ఓవరాల్ గా మాస్ అంశాలతో సాగే ఎమోషనల్ లవ్ స్టొరీ  మ్యూజిక్ లో దేవీ మాస్ ఆడియన్స్ పల్స్ కి భాగా కనెక్ట్ అయ్యాడు.గత చిత్రాల వలే బోయపాటి అటు యూత్ ని, ఇటు ఫ్యామిలీని, మరో వైపు మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది.