రివ్యూ : ధన్ ధనాధన్ 'ఆఫీసర్'

రివ్యూ : ధన్ ధనాధన్ 'ఆఫీసర్'

01-06-2018

రివ్యూ : ధన్ ధనాధన్ 'ఆఫీసర్'

తెలుగుటైమ్స్ రేటింగ్ : 2.5/5

బ్యానర్ : ఆర్ కంపెనీ ప్రొడక్షన్స్
నటీనటులు : అక్కినేని నాగార్జున, మైరా సరీన్, ఫిరోజ్ అబ్బాసీ, షాయాజీ షిండే, అజయ్, మరియు బేబీ కావ్య 
మ్యూజిక్ : రవి శంకర్, ఎడిటింగ్ : అన్వార్ అలీ, ఆర్ కమల్
సినిమాటోగ్రఫీ :భారత్  వ్యాస్  యన్, రాహుల్  పెనుమత్స
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ

విడుదల తేదీ : 01.06.2018

 

ఏప్పుడో పాతికేళ్ల క్రితం శివ అనే సినిమా తీసి, అప్పటి నుంచి అదే విజిటింగ్ కార్డుతో కాలం నెట్టుకు వచ్చేస్తున్నారు రామ్ గోపాల్ వర్మ అండ్ ఆయన టీమ్. కింగ్ నాగార్జునతో  శివ సినిమాకి సీక్వల్గా కంపెనీ బ్యానర్ లో వచ్చిన ఆఫీసర్ ఏ స్థాయిలో ఉందొ చూద్దాం.

కథ :

సిన్సియర్ పోలీస్ గా ముంబైలో మాఫియాను రూపుమాపేసిన నారాయణ పసారి (ఫెరోజ్ అబ్బాసీ)  తన లోపల మాత్రం తన స్వలాభం కోసం కొందరిని చంపేస్తాడు. అయితే అది ఫేక్ ఎంకౌంటర్ అని తేలగా దాని మీద ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతారు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసేందుకు హైదరాబాద్ నుండి ఐపిఎస్ ఆఫీసర్ శివాజి రావు (నాగార్జున)ను ముంబైకి బదిలీ చేస్తారు. ముందు పసారి మంచి పోలీస్ అనుకున్న శివాజి రావు తన ఇన్వెస్టిగేషన్ లో కొన్ని నిజాలు తెలుసుకుంటాడు. ఇక శివాజి కదలికలు కనిపెట్టిన నారాయణ పసారి మళ్లీ తానే ఓ కంపెనీ స్టార్ట్ చేసి ముంబైలో మాఫియా అలజడలను సృష్టిస్తాడు. దాన్ని అరికట్టేందుకు పసారినే ప్రభుత్వం నియమిస్తుంది. సో పసారి ఏర్పాటు చేసిన కంపెనీని నాశనం చేసేందుకు శివాజి ఏం చేశాడు అన్నదే  సినిమా కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్:

నాగర్జున శివాజి రావుగా పోలీస్ ఆఫీసర్ గా అదరగొట్టాడు. స్క్రీన్ ప్రెజెన్స్ లో నాగార్జున స్టైలే వేరు అన్నట్టుగా సినిమాలో చాలా గ్లామర్ గా కనిపించారు. శివ టైంలో నాగార్జునకి, ఇప్పటికి కాస్త లావెక్కాడే తప్ప మిగతా అంతా సేమ్ అనిపిస్తుంది. ఇక హీరోయిన్ మైరా సరైన్ బాగానే చేసింది. విలన్ పసారి పాత్రలో నటించిన ఫెరోజ్ అబ్బాసీ  కూడా బాగా చేశాడు. అజయ్, షియాజి షిండే పాత్రలు అలరించాయి. సినిమాలో పాప పాత్ర కూడా ఆకట్టుకుంటుంది.

సాంకేతిక వర్గం:

భరత్ వ్యాస్ సినిమాటోగ్రఫీ బాగుంది. వర్మ టేకింగ్ కు అనుగుణంగా కెమెరా వర్క్ ఉంది. ఇక కథ పాతదే అయినా కథనం పర్వాలేదు అన్నట్టు తీశాడు. అయితే సినిమా ఇంకాస్త గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. రవి శంకర్ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ వరకు ఒకే. ఎడిటింగ్ ఇంకాస్త ట్రిం చేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అంత గొప్పగా ఏమి లేవు. రెగ్యులర్ ఆర్జివి సినిమాలకు తగినట్టుగానే ఉంది.

విశ్లేషణ:

వర్మ,నాగార్జున లాంటి హేమా హేమీల కాంబినేషన్ సినిమా అన్నపుడు సినిమాటొగ్రఫీ, మిగతా సాంకేతిక విలువలు ఎలాగైనా కాస్త చెప్పుకోదగ్గ స్థాయిలోనే వుంటాయి. ఆఫీసర్ లోనూ అలాగే వున్నాయి. తప్ప మరీ ఎక్స్ ట్రార్డినరీగా మాత్రం కాదు.ఇలాంటి సినిమాలో నాగార్జున అలా అలా చేసేసాడు. పసారిగా ఫిరోజ్ బాగా చేసాడు. మిగిలిన వారు ఓకె. కావ్య క్యారెక్టర్ ప్రవేశపెట్టి, పేరెంట్స్ ఎపిసోడ్స్ ను మధ్య మధ్యలో చేర్చి, సినిమాకు ఫ్యామిలీ ఎమోషన్స్ టచ్ ఇవ్వాలని చూసాడు. కానీ అవన్నీ అలా అలా తేలిపోయాయి తప్ప, సిన్సియర్ ఎటెంప్ట్ అనిపించలేదు. అంతెందుకు హీరో భార్య బాంబు దాడిలో చనిపోయినట్లు తీసిన సన్నివేశం కూడా వర్మ కు సినిమా తీత మీద సీరియస్ నెస్ లేదని అనడానికి ఓ ఉదాహరణ. తక్కువలో, త్వరగా చుట్టేద్దాం అని ముందే డిసైడ్ అయ్యారని ఆ సీన్ చెబుతుంది.టేకింగ్ పరంగా వర్మ ఓకే అనిపించుకున్నా కంటెంట్ విషయంలో ఇంకాస్త వర్క్ అవుట్ చేస్తే బాగుండేది అనిపిస్తుంది. ఎంటర్టైనింగ్ విషయంలో కూడా సగటు ప్రేక్షకుడికి ఇది నిరాశ కలిగిస్తుందని చెప్పొచ్చు.