మీకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నా

మీకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నా

16-11-2017

మీకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నా

భారత్‌-అమెరికాల మధ్య ఆర్థిక  సహకారం నైపుణ్యవంతులైన వ్యాపారవేత్తలకు మేలు చేకూరుస్తుందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనేందుకుగాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ఈ నెలాఖర్లో భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో మోదీ ట్విట్టర్‌లో స్పందిస్తూ మీకు స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నా. భారత్‌ అమెరికా మధ్య  సన్నిహిత ఆర్థిక సహకారం మన ప్రజలకు దోహదపడుతుంది. ముఖ్యంగా నైపుణ్యవంతులైన వ్యాపారులకు అని వ్యాఖ్యానించారు.