ఎన్ని స్థానాల్లో పోటీ చేసేది 2018 చివర్లో చెప్తా

ఎన్ని స్థానాల్లో పోటీ చేసేది 2018 చివర్లో చెప్తా

03-09-2017

ఎన్ని స్థానాల్లో పోటీ చేసేది 2018 చివర్లో చెప్తా

జనసేన అధినేత పవన్‌ 

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానాల్లో పోటీ చేస్తుందన్న దానిపై ఇప్పుడే తానేమీ చెప్పలేనని.. 2018 ఆఖరు నాటికే దీనిపై ఒక స్పష్టత వస్తుందని ఆ పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్ చెప్పారు. జనసేన డిజిటల్‌ కార్యకర్తలతో భేటీకి సంబంధించిన వీడియోను శుక్రవారం ఆ పార్టీ మీడియాకు విడుదల చేసింది.

ప్రస్తుతం తన రాజకీయ బలమెంతో తనకే తెలియదని, అక్టోబర్‌ నుంచి ప్రజలోకి వెళ్లిన తర్వాత క్రమంగా స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రాంతాలవారీగా ప్రత్యేకించి తనకు ఎటువంటి ప్రాధాన్యతా ఉండదని, తెలంగాణ అంటే తనకు ఎక్కువ అభిమానమని తెలిపారు. ఇతర రాజకీయ పార్టీలతో కలసి పనిచేసే అంశంపై అన్ని అవకాశాలకు జనసేన పార్టీ తలుపులు తెరిచి ఉన్నాయని పవన్‌  చెప్పారు.