నేను అప్పుడే చెప్పా.. మోడీ పట్టించుకోలేదు

నేను అప్పుడే చెప్పా.. మోడీ పట్టించుకోలేదు

03-09-2017

నేను అప్పుడే చెప్పా.. మోడీ పట్టించుకోలేదు

పెద్దనోట్ల రద్దు అంశంపై చాలా రోజుల తర్వాత పెదవి విప్పారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్.  పెద్ద నోట్ల రద్దుతో నష్టమని మోడీ సర్కార్ ను తాను హెచ్చరించానని.. అయినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. నోట్ల రద్దుపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ సమయంలో రాజన్ మాటలు ఆసక్తికరంగా మారాయి. నోట్ల రద్దు వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాల కన్నా స్పల్పకాలికంగా జరిగే నష్టమే ఎక్కువ అని తాను చెప్పానని తెలిపారు. నల్లధనాన్ని వెలికితీసేందుకు ఇతర ప్రత్యామ్నాయాలను తాను సూచించానని, అయినా, ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. ‘ఐ డూ వాట్‌ ఐ డూ: రిఫార్మ్స్‌, రెటారిక్‌, రిజాల్వ్‌’ పేరిట రాజన్‌ రాసిన పుస్తకం వచ్చేవారం విడుదల కానుంది. 2016 ఫిబ్రవరిలో పెద్దనోట్ల రద్దుపై తన అభిప్రాయం తెలుపాలని ప్రభుత్వం మౌఖికంగా కోరిందని, దీంతో ప్రభుత్వం పెద్దనోట్ల రద్దును చేపడితే.. తీసుకోవాల్సిన చర్యలు, అందుకు అనువైన సమయంపై నోట్‌ను ఆర్బీఐ సర్కారుకు సమర్పించిందని తెలిపారు. ఆర్బీఐ గవర్నర్‌గా గత ఏడాది సెప్టెంబర్‌ 5న తన పదవీకాలం ముగియడంతో తిరిగి షికాగో యూనివర్సిటీ బిజినెస్‌ స్కూల్‌ అధ్యాపకుడిగా రాజన్‌ చేరిన సంగతి తెలిసిందే. పెద్దనోట్ల రద్దు గురించి తన హయాంలోనే ప్రభుత్వం సంప్రదించినా.. నిర్ణయం తీసుకోవాలని మాత్రం తనను కోరలేదని స్పష్టం చేశారు.