తెలుసుకోండి : ఐడియా ఆఫర్‌ అదిరింది

తెలుసుకోండి : ఐడియా ఆఫర్‌ అదిరింది

13-06-2017

తెలుసుకోండి : ఐడియా ఆఫర్‌ అదిరింది

రిలయన్స్ జియో ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. దీంతో టెలికాం రంగంలో తీవ్ర పోటీ ఏర్పడింది. జియో నుంచి తమ కస్టమర్లను కాపాడుకునేందుకు మిగతా సంస్థలు కూడా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఐడియా సెల్యులార్ తన వినియోగదారుల కోసం ఓ బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ప్రీపెయిడ్‌ కస్టమర్లు రూ.396తో రీఛార్జ్‌ చేసుకుంటే 70GB డేటాను పొందేలా ఆఫర్ ను ప్రకటించింది. దీన్ని 70 రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చు. డేటాతో పాటు 3వేల నిమిషాల లోకల్‌..STD కాల్స్‌ చేసుకునే అవకాశం కూడా ఉంది.

అంతేకాదు ఈ రీఛార్జ్‌తో ఐడియా నెట్‌వర్క్‌తో పాటు…. ఇతర నెట్‌వర్క్‌లకు ఫ్రీ కాల్స్‌ చేసుకోవచ్చు. అయితే రోజులో 300 నిమిషాలు, వారానికి 1,200 నిమిషాలు మాత్రమే వినియోగించుకునే వెసులుబాటు ఉంది. లిమిట్ దాటిన కాల్స్‌కు నిమిషానికి 30పైసలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక రోజుకు 1జీబీ డేటాను మాత్రమే ఈ ప్యాక్‌ ద్వారా వినియోగించుకునే అవకాశం ఉంది.