ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అదే జరుగుతుంది : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అదే జరుగుతుంది : చంద్రబాబు

24-01-2020

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అదే జరుగుతుంది : చంద్రబాబు

శాసనమండలిలో తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సృష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి కోసం ప్రజలు పోరాడుతున్నారు. రాజధాని తరలింపు ఎవరికీ ఇష్టం లేదు. ఈ పోరాటం ఆగదు అని సృష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు, నాలుగోస్తంభంగా పత్రికలు ఉన్నాయి. ఇవన్నీ ఒకదాని తప్పొప్పులు మరొకటి సరిచేస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అదే జరుగుతోంది. పాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల్ని శాసనమండలి సెలక్ట్‌ కమిటీకి పంపాలని నిర్ణయించింది. కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా ప్రభుత్వం స్పందిస్తుంది అని పేర్కొన్నారు.