వారికి మోదీ, అమిత్‌ షా అనుమతి లేదు : పవన్‌ కల్యాణ్‌

వారికి మోదీ, అమిత్‌ షా అనుమతి లేదు : పవన్‌ కల్యాణ్‌

24-01-2020

వారికి మోదీ, అమిత్‌ షా అనుమతి లేదు : పవన్‌ కల్యాణ్‌

రాష్ట్రంలో భూ దందాల కోసమే వైకాపా 3 రాజధానులను ఏర్పాటు చేస్తోందని జనసేన అధినే పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. 3 రాజధానుల ఏర్పాటుపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా నుంచి అనుమతి తీసుకున్నామని వైకాపా నేతలు పదేపదే చెబుతున్నది అంతా అబద్ధమన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్‌ కల్యాణ్‌ నాదెండ్ల మనోహర్‌, బీజేపీ నేతలు సునీల్‌ దేవధర్‌, జీవీఎల్‌ నరసింహారావు, పురందేశ్వరి సమావేశమయ్యారు. అనంతరం పవన్‌ మీడియాతో మాట్లాడుతూ భూదందాల కోసమే వైకాపా 3 రాజధానులను తీసుకొచ్చిన విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. ప్రజలకు వ్యతిరేకంగా వైకాపా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, గతంలో టీడీపీ చేసిన ప్రజా వ్యతిరేక పనులపై బీజేపీ, జనసేన కలిసి పోరాడతాయని సునీల్‌ దేవ్‌ధర్‌ ప్రకటించారు.