అప్పటి వరకు కార్యాలయాలు తరలించొద్దు : హైకోర్టు

అప్పటి వరకు కార్యాలయాలు తరలించొద్దు : హైకోర్టు

23-01-2020

అప్పటి వరకు కార్యాలయాలు తరలించొద్దు : హైకోర్టు

మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ, రాజధాని తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిల్లులు ఏ స్థాయిలో ఉన్నాయని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) శ్రీరామ్‌ సుబ్రమణ్యంను ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జేకే మహేశ్వరి ప్రశ్నించారు. శాసనసభలో బిల్లులు ఆమోదం పొంది మండలికి వెళ్లాయని ఏజీ తెలిపారు. మండలిలో సెలెక్ట్‌ కమిటీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్లు వివరించారు. బిల్లులపై విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడగా.. విచారణ జరగకపోతే ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు తరలిస్తారని, విచారణ జరపాలని పిటిషనర్ల తరపు న్యాయవాది అశోక్‌ భాన్‌ కోరారు. దీనిపై స్పందించిన సీజే.. విచారణ పూర్తయ్యే వరకు కార్యాలయాలు తరలించకూడదని, తరలిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు. అనంతరం తదుపరి విచారణను ఫిబ్రవరి 26కి హైకోర్టు వాయిదా వేసింది.