తెలుగు రాష్ట్రాల గవర్నర్లు రికార్డు

తెలుగు రాష్ట్రాల గవర్నర్లు రికార్డు

11-09-2019

తెలుగు రాష్ట్రాల గవర్నర్లు రికార్డు

దేశంలోని గవర్నర్లలో చిన్న వయసున్న గవర్నర్‌గా తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (58), వయోధిక గవర్నర్‌గా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌(85) రికార్డులకు ఎక్కారు. ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఐదు రాష్ట్రాల గవర్నర్‌లను నియమించిన తర్వాత గవర్నర్‌ల సగటు వయసుగా 73గా ఉంది. 60 ఏళ్లలోపు వయసున్న ఏకైక గవర్నర్‌ కూడా తమిళిసై కావడం విశేషం. ఈ ఏడాది జులై నుంచి గుజరాత్‌ గవర్నర్‌గా వ్యవహిస్తున్న ఆచార్య దేవవ్రత్‌ వయసు 60 ఏళ్లు. చాలా మంది గవర్నర్లు 70 ఏళ్ల నుంచి 79 ఏళ్ల మధ్య వారే. దేశంలోని 29 రాష్ట్రాలకు సంబంధించిన 28 మంది గవర్నర్లలో ఒక్కరు మాత్రమే 60 లోపు వయసువారు కాగా, ఏడుగురు 60ల్లో, 14 మంది 70ల్లో, ఆరుగురు 80ల్లో ఉన్నారు. మొత్తం గవర్నర్లలో 19 మంది తొలిసారి బాధ్యతలు చేపట్టినవారు కాగా, 9 మందికి గతంలో రాజ్‌భవన్‌కు వెళ్లివచ్చిన అనుభవం ఉంది. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ వయసు 84 ఏళ్లు. హరిచందన్‌ తర్వాత ఆయనే వయోధిక గవర్నర్‌.