కేటీఆర్‌కు ప్రభాస్‌ మద్దతు!

కేటీఆర్‌కు ప్రభాస్‌ మద్దతు!

11-09-2019

కేటీఆర్‌కు ప్రభాస్‌ మద్దతు!

తెలంగాణ మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు హీరో ప్రభాస్‌ మద్దతు తెలిపారు. అయితే ఇది రాజకీయంగా మద్దతు కాదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడచూసినా జ్వరాలతో బాధపడుతున్నారనీ, ఈ దశలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా కొన్ని సూచనలు చేశారు. వైరల్‌ జ్వరాలు, డెంగ్యూ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, మీ ఇంటి ఆవరణలో ఉన్న నీటి తొట్టెలు, పూల కుండీలు, ఎయిర్‌ కూలర్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. దోమల వ్యాప్తికి ఇవే కారణం. నా ఇంటి పరిసరాలను తనిఖీచేసి నిల్వ ఉన్న నీటిని తొలగించామన్నారు. డెంగ్యూ రాకుండా మీ ఇంటి పరిసరాలను శుభ్రం ఉంచుకోండన్నారు. ప్రభాస్‌ మద్దతు తెలిపినందుకు కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.