పీవీ సింధుకు కర్ణాటక సీఎం ఆహ్వానం

పీవీ సింధుకు కర్ణాటక సీఎం ఆహ్వానం

11-09-2019

పీవీ సింధుకు కర్ణాటక సీఎం ఆహ్వానం

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణీ పీవీ సింధుకు అరుదైన గౌరవం లభించబోతోంది. ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన అనంతరం వివిధ రాష్ట్రాలు అమెను సముచిత రీతిన గౌరవిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలలో భాగంగా అక్టోబరు ఒకటిన జరిగే 'యువ కర్ణాటక దసరా' వేడుకలను ప్రారంభించాలని కర్ణాటక ప్రభుత్వం ఆమెకు లేఖ రాసింది. ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప స్వయంగా ఈ లేఖ ద్వారా సింధును ఆహ్వానించారు. దసరా వేడుకలకు ప్రభుత్వ ప్రత్యేక అతిథిగా హాజరు కావాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.