ఫ్రాన్స్‌లో మోదీకి తెలంగాణ యువకుడి స్వాగతం

ఫ్రాన్స్‌లో మోదీకి తెలంగాణ యువకుడి స్వాగతం

22-08-2019

ఫ్రాన్స్‌లో మోదీకి తెలంగాణ యువకుడి స్వాగతం

ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ పర్యటన సందర్భంగా పారిస్‌ ఎయిర్‌పోర్టులో ఆయనకు స్వాగతం పలికే అరుదైన అవకాశాన్ని తెలంగాణ యువకుడు కూనూరి సాయిరాం దక్కించుకున్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురానికి చెందిన సాయిరాం.. ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ బొరోడాక్స్‌లో నానో టెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నారు. మోదీకి స్వాగతం పలికేందుకు రావాల్సిందిగా భారత అధికారులు ఆయనను ఆహ్వానించారు.