లతా మంగేష్కర్‌ను పరామర్శించిన రాష్ట్రపతి

లతా మంగేష్కర్‌ను పరామర్శించిన రాష్ట్రపతి

19-08-2019

లతా మంగేష్కర్‌ను పరామర్శించిన రాష్ట్రపతి

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పరామర్శించారు. ముంబయిలోని ఆమె నివాసానికి వెళ్లి, కాసేపు ముచ్చటించారు. కోవింద్‌ తన ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉందని లెజెండరీ గాయని ట్వీట్‌ చేశారు. ఆయనతో కలిసిన దిగిన ఫొటోలను లత షేర్‌ చేశారు. మన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నన్ను కలవడానికి మా ఇంటికి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నాం సర్‌.. మీరు మేము గర్వపడేలా చేశారు అని ట్వీట్‌ చేశారు. వేలాది హిందీ సినిమాల కోసం పాటలు పాడారు. ఆమె చిత్ర పరిశ్రమకు చేసిన సేవకు గాను 1989లో భారత ప్రభుత్వం దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. 2001లో అత్యున్నత పురస్కారం భారత రత్న అవార్డుతో గౌరవించింది.