హరీష్ రావుకు ఆహ్వానం అందేనా?

హరీష్ రావుకు ఆహ్వానం అందేనా?

17-06-2019

హరీష్ రావుకు ఆహ్వానం అందేనా?

తెలంగాణ రాష్ట్ర వరప్రదాయిని, బీడు భూములను సస్యశ్యామలంగా మార్చే.. ఇంజనీరింగ్‌ అద్భుతం.. సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు ఈ నెల 21న ప్రారంభించేందుకు సర్కార్‌ సన్నాహాలు చేస్తుంది. ఈ ప్రాజెక్టును అన్ని అనుమతులు తీసుకురావటంతో, ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయటంలో మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, ఎమ్మెల్మే హరీష్‌రావు ప్రత్యేక కృషిని ఎవ్వరు కాదనలేరు. అలాంటి నాయకుడికి ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుతుందా? లేదా? అన్న మీమాంశ ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేయటంలో, మూడు షిప్టుల్లో పనులు జరుపటంతో హరీష్‌రావు రెయింబవళ్లు ఇంజనీర్‌లాగా పనుల్లో భాగస్వామైనారు. మూడున్నర సంవత్సర కాలంలోనే ప్రాజెక్టుకును 90 శాతంపైగా పూర్తి చేయటంలో హరీష్‌రావు ప్రధాన భూమికను నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావటంతో కాళేశ్వరం ప్రాజెక్టును కీలక అంశంగా మారింది. హరీష్‌రావుకు ఆహ్వానం అందుతుందా? లేదా? చూద్దాం.