కమలం గూటికి కోమటిరెడ్డి ?

కమలం గూటికి కోమటిరెడ్డి ?

17-06-2019

కమలం గూటికి కోమటిరెడ్డి ?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బీజేపీలో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. తనతోపాటు కాంగ్రెస్‌కు చెందిన మరికొందరు ముఖ్యులు, మద్దతుదారులను కూడా కమలం గూటికి తీసుకెళ్లేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సహా భువనగిరి, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని పలువురు నేతలతో ఫోన్‌లో మంతనాలు సాగించినట్లు తెలిసిది. వీరిలో కొందరు ఆయన వెంట బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేయగా, మరికొందరు తర్వాత మాట్లాడదాం అంటూ బదులిచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అంటూ రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ఆయన తన సన్నిహితులతో సంప్రదింపులు మొదలుపెట్టడంతో రాజగోపాల్‌ కాంగ్రెస్‌ను వీడి, బీజేపీలో చేరడం ఖాయమనే అభిప్రాయానికి ఆయన ముఖ్య అనుచరులు కూడా వచ్చినట్లు తెలుస్తొంది.