ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం

ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం

15-06-2019

ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణికి తృటిలో ప్రమాదం తప్పింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆమె తొలిసారిగా సొంత జిల్లా విజయనగరం పర్యటనకు వెళ్లారు. స్వాగత ఏర్పాట్లలో భాగంగా పార్టీ కార్యకర్తలు భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యలో స్వాగత ఏర్పాట్లలో భాగంగా రాజాపులోవ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై కార్యకర్తలు ఎక్కడంతో వేదిక ఓ పక్కకు ఒరిగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ఆమె వేదిక పై నుంచి కిందకు దిగారు. కొద్దిసేపటికే వేదిక కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పరిణామంతో వెంటనే మంత్రి తిరిగి పయనమయ్యారు.