బ్యాంకు ఖాతాదారులకు తీపికబురు

బ్యాంకు ఖాతాదారులకు తీపికబురు

15-06-2019

బ్యాంకు ఖాతాదారులకు తీపికబురు

ఇటీవల కాలంలో చాలా ఏటీఎంలు నో క్యాష్‌ బోర్డుతో కనిపించడం పరిపాటిగా మారింది. ఇకమీదట ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. రోజుల తరబడి ఏటీఎంలో నగదు నింపకుండా, వినియోగదారులకు అసౌకర్యానికి గురిచేసే బ్యాంకులపై కఠిన చర్యలకు రిజర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఉపక్రమించింది. మూడు గంటలకు మించి ఏటీఎంలు నగదు లేకుండా ఖాళీగా ఉండరాదని, నిర్ణీత వ్యవధి దాటిపోతే బ్యాంకులకు జరిమానా తప్పదని ఆర్‌బిఐ హెచ్చరించింది. అయితే, ప్రాంతాల వారీగా ఈ జరిమానా స్థాయి ఆధారపడి ఉంటుంది. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాలను బట్టి జరిమానా విధించనున్నారు. ఏదేమైనా, ఆర్‌బిఐ తాజా నిర్ణయం ఏటీఎం వినియోగదారులకు నిస్సందేహంగా తీపికబురేనని చెప్పారు.