మే 23న చంద్రబాబుకు పట్టాభిషేకం

మే 23న చంద్రబాబుకు పట్టాభిషేకం

15-04-2019

మే 23న చంద్రబాబుకు పట్టాభిషేకం

మే 23న రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకి పట్టాభిషేకం చేయనున్నారని ప్రభుత్వ విప్‌ బుద్దా వెంకన్న అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా, బీజేపీ నాయకులపై మండిపడ్డారు. ఈవీఎం  లోపాలపై టీడీపీ అధినేత చంద్రబాబు పోరాటం చేస్తుంటే, ఆయనకు ఓటమి భయం పట్టుకుందని విపక్ష నేతలు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని అవాకులు చవాకుల పేలినా ఐదేళ్ల పాలు ప్రజ సంక్షేమం కోసం పనిచేసిన చంద్రబాబే మళ్లీ అధికారంలోకి వస్తారన్నారు. ఈవీఎంలు పనిచేయక మహిళలు, వృద్ధులు  ఇబ్బందులు పడితే, వైకాపా నేత విజయసాయి రెడ్డి ఈసీ బాగా పనిచేసిందంటూ కితాబివ్వడమేంటని ప్రశ్నించారు. అధికారంలోకి రాక ముందే అరాచకాలు సృష్టిస్తున్న వైకాపా, భవిష్యత్తులో రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తారేమోనంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లోనైనా ఎన్నికలు సజావుగా జరగాలని టీడీపీ అధినేత పోరాటం చేస్తున్నారని, ఓటమి భయం ఉన్నవారైతే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేవారేకాదని సృష్టం చేశారు.