తెలంగాణ మంత్రులను ఏపీ పైకి పంపి రెచ్చగొడుతున్నారు : చంద్రబాబు

తెలంగాణ మంత్రులను ఏపీ పైకి పంపి రెచ్చగొడుతున్నారు : చంద్రబాబు

21-03-2019

తెలంగాణ మంత్రులను ఏపీ పైకి పంపి రెచ్చగొడుతున్నారు : చంద్రబాబు

ఎలక్షన్ మిషన్‌పై టీడీపీ నేతలు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్. రుణమాఫీ అసాధ్యమన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైతులపై మొసలికన్నీరు కారుస్తున్నారు. రుణమాఫీ అసాధ్యమన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రైతులపై మొసలికన్నీరు కారుస్తున్నారు. జగన్ అవినీతి వల్ల వాన్‌పిక్‌కు, లేపాక్షికి వేల ఎకరాలు.. కట్టబెట్టారు, బ్రాహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 10వేల ఎకరాలు నిరూపయోగంగా మారాయి. జగన్ సమాజానికే పెనుప్రమాదంగా మరారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై డ్రామాల మీద డ్రామాలు నడుస్తున్నాయి. టీడీపీ డేటా చోరీకి భారీ కుట్ర జరిగింది, 9లక్షల ఓట్ల తొలగింపు.. ఇంకో కుట్ర. జగన్ కుట్రలకు, డ్రామాలకు అంతేలేకుండా పోయింది.

ఏపీ పోలీసులు, వైద్యులపై నమ్మకం లేదన్న జగన్‌కు.. ఓట్లు మాత్రం కావాలా? కేసీఆర్ రిటన్ గిఫ్ట్‌లు అంటున్నారు, తెలంగాణ మంత్రులను ఏపీ పైకి పంపి రెచ్చగొడుతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థులకు ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అని అంటున్నారు. అలాంటివాళ్లను గెలిపిస్తే ఏం చేస్తారు. అవిశ్వాసంలో మోదీని గెలిపించేందుకే వైసీపీ ఎంపీల రాజీడ్రామా ఆడారు. ఆంధ్రప్రదేశ్‌పై గద్దల మాదిరిగా వాలుతున్నారు, ఏపీని మింగేసేందుకు వస్తున్న గద్దలకు బుద్ధిచెప్పాలి. టీడీపీ అభ్యర్ధులకు బెదిరింపులు, కార్యకర్తలకు వేధింపులు వస్తున్నాయి. ఆర్ధికమూలాలు దెబ్బతీస్తూ వదంతులతో అపోహలు సృష్టిస్తున్నారు. మైండ్‌గేమ్‌తోనే ఆదాల, అవంతి, ఆమంచి, మాగుంటలను లాక్కున్నారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ కుట్రలకు ప్రజలు తగిన బుద్ధిచెప్పాలి. జగన్ అవినీతి వల్ల వాన్‌పిక్‌కు, లేపాక్షికి వేల ఎకరాలు.. కట్టబెట్టారు. బ్రాహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 10వేల ఎకరాలు నిరూపయోగంగా మారాయి. జగన్ సమాజానికే పెనుప్రమాదంగా మారారు