జయరాం కోమటిని కలిసిన టిటిడిపి అధ్యక్షుడు ఎల్ .రమణ

జయరాం కోమటిని కలిసిన టిటిడిపి అధ్యక్షుడు ఎల్ .రమణ

17-07-2017

జయరాం కోమటిని కలిసిన టిటిడిపి అధ్యక్షుడు ఎల్ .రమణ

బే ఏరియాలో పర్యటిస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌. రమణ అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ఎన్నారై టీడిపి ప్రముఖుడు అయిన జయరాం కోమటిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎల్‌. రమణ మాట్లాడుతూ, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ  బలపడుతోందని, వచ్చే ఎన్నికల్లో టిటిడిపి గెలుపు ఖాయమని చెప్పారు. జయరాం కోమటి మాట్లాడుతూ, సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ, ముఖ్యంగా హైదరాబాద్‌ అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. నేడు ఆ విధంగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతాన్ని కూడా అభివృద్ధిపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు.  ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడిపి అభిమానులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.