హైదరాబాద్‌లో ట్రెడా ప్రాపర్టీ షో

హైదరాబాద్‌లో ట్రెడా ప్రాపర్టీ షో

11-10-2019

హైదరాబాద్‌లో ట్రెడా ప్రాపర్టీ షో

రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు సంబంధించిన సంపూర్ణ సమాచారంతో హైదరాబాద్‌లో ట్రెడా ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నట్లు ట్రెడా అధ్యక్షుడు చలపతిరావు వెల్లడించారు.10వ ట్రెడా ప్రాపర్టీ షో వివరాలను వెల్లడించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు హైటెక్స్‌లో ఈ షోను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 100 మందికి పైగా బిల్డర్లతో పాటు బిల్డింగ్‌ మెటీరియల్‌ సరఫరాదారులు, పరిశోధన, సాంకేతిక అభివృద్ధి సంస్థలు, ఆర్థిక సంస్థలు తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శించనున్నాయని తెలిపారు. బ్యాంకులు, రియల్టీ సంస్థలు ఇక్కడ తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నాయని చెప్పారు.