న్యూజెర్సిలో ఐటీ ప్రతినిధులతో లోకేష్ భేటీ

న్యూజెర్సిలో ఐటీ ప్రతినిధులతో లోకేష్ భేటీ

05-02-2018

న్యూజెర్సిలో ఐటీ ప్రతినిధులతో లోకేష్ భేటీ

ఆంధ్రప్రదేశ్‌ను ఐటీ రంగానికి కేంద్రంగా మలచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, అందుకు అనుగుణంగా చర్యలను, పాలసీలను తీసుకువచ్చామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. న్యూజెర్సిలో పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐటీ అభివద్ధి ఒకే చోట కేంద్రీక తం కాకుండా అన్ని చోట్లకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, అనంతపురంలో ఐటీ పార్కులు అభివద్ధి చేస్తామన్నారు. హైదరాబాద్‌ పేరు చెప్పగానే మైక్రోసాప్ట్‌ ఎలా గుర్తుకొస్తుందో, విశాఖపట్నం పేరు చెప్పగానే ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ పేరు, తిరుపతి పేరు చెప్పగానే జోహో, అమరావతి పేరు చెప్పగానే హెచ్‌సీఎల్‌ పేరు గుర్తుకొస్తాయన్నారు. ఏ సంస్థకైనా వారి నిబద్ధత చూసిన తర్వాతేభూములు కేటాయిస్తామని స్పష్టం చేశారు.