ఇవాంక పర్యటనకు సర్వం సిద్ధం

ఇవాంక పర్యటనకు సర్వం సిద్ధం

24-11-2017

ఇవాంక పర్యటనకు సర్వం సిద్ధం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, ఆయన సలహాదారు ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌ పర్యటనపై తుది మెరుగులు దాదాపు పూర్తయ్యాయి. ఇవాంక పర్యటనకు సర్వం సిద్ధమైంది. హెచ్‌ఐసిసిలో జరిగే ప్రపంచ పారిశ్రామిక సదస్సులో పాల్గొనేందుకు ఇవాంక ట్రంప్‌ హైదరాబాద్‌ విచ్చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 28, 29 తేదీల్లో ఆమె నగరంలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొనేందుకు, హైదరాబాద్‌ మైట్రో రైలును ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 28న హైదరాబాద్‌కు రానున్నారు. వీరిద్దరి పర్యటన కార్యక్రమాలు ఖరారు అయ్యాయి. కార్యక్రమాల నిర్వహణతో పాటు, వారి భద్రతాఏర్పాటుల చురుకుగా సాగుతున్నాయి.