ట్రంప్‌ కంటే నా కూతురు బాగా పాలించగలదు

ట్రంప్‌ కంటే నా కూతురు బాగా పాలించగలదు

01-09-2017

ట్రంప్‌ కంటే నా కూతురు  బాగా పాలించగలదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే తన నాలుగేళ్ల కుమార్తె నార్త్‌ వెస్ట్‌ చక్కగా బాధ్యతలు నిర్వర్తించగలదని అంటోంది హాలీవుడ్‌ నటి, మోడల్‌ కిమ్‌ కర్దాషియాన్‌. అమెరికా రాజకీయాల గురించి కిమ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. కొన్నిసార్లు నాకు రాజకీయాల గురించి చర్చించాలనిపిస్తుంది. నేను ఎవర్నీ కించపరచాలని అనుకోవడం లేదు. మనకేం కావాలో వాటిని పొందుతూ మన దేశంలో గర్వంగా నివసిస్తున్నాం. రోజు దేశంలో జరిగేకొన్ని విషయాలను మనం నమ్మేలోపే మరుసటి రోజు అంతకుమించిన ఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడున్న ప్రపంచం చాలా భయంకరమైనది. మొన్నటివరకు అమెరికాలో హాయిగా నిశ్చితంగా ఉన్న మనం, ట్రంప్‌ అధ్యక్షుడు కావడంతో ఇక ఆ రక్షణ ఉండదనిపిస్తోంది. అమెరికా దేశాన్ని ఎవరైనా సరైన మార్గంలో నడిపించగలరు. చెప్పాలంటే ట్రంప్‌ కంటే నాలుగేళ్ల నా కూతురు బాగా పాలించగలదు అని చెప్పుకొచ్చింది.