తెక్సాస్‌లో తెలుగువాళ్లకు సాయం చేస్తాం : చంద్రబాబు

తెక్సాస్‌లో తెలుగువాళ్లకు సాయం చేస్తాం : చంద్రబాబు

01-09-2017

తెక్సాస్‌లో తెలుగువాళ్లకు సాయం చేస్తాం : చంద్రబాబు

అమెరికాలో టెక్సాస్‌ను వరదలు తీవ్ర అతలాకుతలం చేశాయని, అక్కడ ఉండే తెలుగువాళ్ల రోడ్డున పడే పరిస్థితి తలెత్తిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వారిని అన్ని విధాలా ప్రభుత్వం తరపున, పార్టీ తరపున సాయం చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే తమ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేతలతో మాట్లాడామన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రవాసీయులను ఎలా ఆదుకోవాలనే అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.