హార్వీ బాధితులకు ట్రంప్‌ భారీ విరాళం

హార్వీ బాధితులకు ట్రంప్‌ భారీ విరాళం

01-09-2017

హార్వీ బాధితులకు ట్రంప్‌ భారీ విరాళం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన పెద్ద మనసుని చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఏమాత్రం వెనుకడుగువేయబోనని, వ్యక్తిగతంగానైనా సాయం చేసేందుకు సిద్ధమని ఆయన నిరూపించుకున్నారు. టెక్సాస్‌, లూసియానాను కుదిపేస్తున్న హారికేన్‌ హార్వే తుఫాన్‌ బాధితులకు ఆయన అండగా నిలిచారు. వ్యక్తిగతంగా 1 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.6.39 కోట్ల)ను సహాయాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. 1 మిలియన్‌ డాలర్ల వ్యక్తిగత ధనాన్ని బాధితుల కోసం ట్రంప్‌ దానం చేయనున్నారని, తాను చెల్లించనున్నారా? లేక ట్రంప్‌ ఫౌండేసన్‌ ద్వారా చెల్లించనున్నారా అనే విషయాన్ని వెల్లడించాల్సి ఉందని వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి సారా సాండర్స్‌ తెలిపారు. ఈ సందర్భంగా బాధితులకు సహాయంగా నిలిచేందుకు ప్రజలు ముందుకు రావాలని, ఆర్థికంగా సహాయం అందించాలని ట్రంప్‌ కోరారని ఆయన తెలిపారు.