ఇది మా దేశం ఇక్కడే ఉంటాం

ఇది మా దేశం ఇక్కడే ఉంటాం

27-03-2017

ఇది మా దేశం ఇక్కడే ఉంటాం

అమెరికాలో ఇటీవలి కాలంలో పెరిగిన జాత్యహంకార దాడులను ప్రస్తావిస్తూ, అమెరికానే తమ దేశమని, తామంతా ఇక్కడే ఉంటామని భారత అమెరికన్లు నినదిస్తున్నారు. పలు చోట్ల సమవేశాలను నిర్వహిస్తూ, జాత్యహంకార దాడులకు నిరసనగా తమ అభిప్రాయాలను సృష్టం చేస్తున్నారు. అధ్యక్షుడు ఏం చెప్పినా, అమెరికా తమ దేశమేనని దక్షిణాసియా అమెరికన్ల సంఘం ప్రతినిధి సుమన్‌ వ్యాఖ్యానించారు. వలస వచ్చే వారికి ఆదర్శంగా నిలిచే దేశంలో, తమకు దక్కాల్సిన సమస్థానం కోసం అడుగుతూనే ఉంటామని ఆయన అన్నారు.