'తామా' చెస్‌ పోటీలు

'తామా' చెస్‌ పోటీలు

27-03-2017

'తామా' చెస్‌ పోటీలు

మెట్రో అట్లాంటా తెలుగు సంఘం ఆధ్వర్యంలో మార్చి 19వ తేదీన బిగ్‌ క్రీక్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో జరిగిన చెస్‌ టోర్నమెంట్‌కు మంచి స్పందన వచ్చింది. దాదాపు 80 మంది ఇందులో పాల్గొన్నారు. అల్లైడ్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సంస్థ ఈ పోటీలను స్పాన్సర్‌ చేసింది. టోర్నమెంట్‌ డైరెక్టర్‌ పర్నెల్‌ వాట్‌కిన్స్‌ జూ. ఈ పోటీలను సజావుగా నిర్వహించడంలో సహాయపడ్డారు. తామా చైర్మన్‌ నగేష్‌ దొడ్డాక, తామా ప్రెసిడెంట్‌ శ్రీ హర్ష ఎర్నేని ఈ సందర్భంగా తామా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను, ఇతర వివరాలను అందరికీ తెలియజేశారు. అల్లైడ్‌ ఇన్‌ఫర్మేటిక్స్‌ సిఇఓ క్రిస్‌ గద్దె మాట్లాడుతూ, ఇలాంటి టోర్నమెంట్‌ల నిర్వహణ వల్ల పిల్లల్లో ఆటలపై ఆసక్తి కలగడంతోపాటు మానసికంగా వారు ఉత్తేజితులవుతారని చెప్పారు. ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేసినవారందరికీ, స్పాన్సర్‌కు తామా బోర్డ్‌ ధన్యవాదాలు తెలియజేసింది.