కాన్సన్ హీరో గ్రిల్లోట్ కు లక్ష డాలర్లు ఇచ్చిన ఇండియన్ అమెరికన్ లు

కాన్సన్ హీరో గ్రిల్లోట్ కు లక్ష డాలర్లు ఇచ్చిన ఇండియన్ అమెరికన్ లు

26-03-2017

కాన్సన్ హీరో గ్రిల్లోట్ కు లక్ష డాలర్లు ఇచ్చిన ఇండియన్ అమెరికన్ లు

కాన్సన్‌లో తెలుగువాడిని కాపాడిన అమెరికన్‌ ఇయాన్‌ గ్రిల్లోట్‌కు హ్యూస్టన్‌లోని ఇండియన్‌ అమెరికన్‌ కమ్యూనిటీ లక్ష డాలర్ల చెక్కుతోపాటు ఘనంగా సన్మానించింది. నిజజీవితంలో ఆయన చూపించిన సాహసాన్ని అభినందిస్తూ సన్మానంతో పాటు సొంత ఇల్లు కొనుక్కునేందుకు గాను లక్ష డాలర్ల చెక్కును బహుకరించింది. గత ఫిబ్రవరి 22న ఆడమ్పురింటన్ అనే సాయుధుడు జరిపిన కాల్పుల్లో భారత ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోగా, కూచిభొట్ల శ్రీనివాస్ మిత్రుడు అలోక్‌‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గ్రిల్లోట్గాయపడ్డారు.

నా తోటి వ్యక్తి కోసం నేను ఏం చేయాలో అదే చేసాను. ఆపదలో ఉన్న వ్యక్తి ఎక్కటి నుంచి వచ్చాడు, అతని జాతి ఏమిటనేది అప్రస్తుతం. మనందరం మనుషులం. ఆసమయంలో నేను ఏది సరైన పనో అదే చేశాను' అని చికిత్స సమయంలో గ్రిల్లోట్ మీడియాతో మాట్లాడుతూ తన మానవతను చాటుకున్నారు. 'నిజమైన హీరో'గా అమెరికన్ల ప్రశంసలుఅందుకున్నారు.

 కాగా, గాయల నుంచి కోలుకున్న గ్రిల్లోట్‌ను హుస్టన్‌లో సన్మానించి, చెక్ అందజేసినట్టు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపింది. సాటి వ్యక్తి కోసం ప్రాణాలు తెగించేనిజమైన హీరోను ప్రతి రోజూ చూడలేమని, అలాంటి అరుదైన సాహసంతో అమెరికా గొప్పదనాన్ని అందరికీ గుర్తుచేసిన గ్రిల్లోట్ అభినందనీయుడని ఆ ప్రకటన పేర్కొంది.